రాజస్థాన్ దెబ్బకు కేకేఆర్ ఔట్.. ఢిల్లీతో మ్యాచ్ నామమాత్రం
- ముంబైపై రాజస్థాన్ రాయల్స్ విజయం... ప్లేఆఫ్స్ చేరిన నాలుగో జట్టుగా ఖరారు
- దీంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు
- కోల్‌కతా, ఢిల్లీ మధ్య చివరి లీగ్ మ్యాచ్ నామమాత్రం
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్
- గెలుపుతో సీజన్‌ను ముగించాలని చూస్తున్న ఇరు జట్లు
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి, నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మధ్య జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ పూర్తిగా నామమాత్రంగా మారిపోయింది.
ఈ అప్రాధాన్య మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వాస్తవానికి ప్లేఆఫ్స్ చేరాలంటే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై భారీ తేడాతో గెలవడంతో పాటు, ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలి. అయితే, రాజస్థాన్ గెలవడంతో కేకేఆర్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. అటు, పంజాబ్ కింగ్స్ ఆశలు కూడా ఆవిరైపోయాయి. పంజాబ్ జట్టు కూడా సమీకరణాలు అనుకూలిస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, రాజస్థాన్ గెలుపుతో పంజాబ్ తీవ్ర నిరాశకు గురైంది.
టాస్ గెలిచిన అనంతరం రహానే మాట్లాడుతూ.. రాజస్థాన్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా తాము గెలవడానికే ఆడతామని చెప్పాడు. "ఈ సీజన్‌లో మేము పుంజుకున్న తీరు పట్ల గర్వంగా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టోర్నీని ముగించాలనుకుంటున్నాం" అని అన్నాడు.
ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. ఈ సీజన్‌లో కీలక సమయాల్లో క్యాచ్‌లు జారవిడిచి మూల్యం చెల్లించుకున్నామని, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని వ్యాఖ్యానించాడు.
ఢిల్లీ జట్టులోకి కుల్దీప్ యాదవ్, అకిబ్ నబీ తిరిగి రాగా, కేకేఆర్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ప్లేఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ, ఇరు జట్లు గెలుపుతో సీజన్‌ను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.